ఏపీ గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ..!

ఇటీవలే ఏపీ ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గవర్నర్ తీరుపై ఇప్పటికే ఎంతోమంది ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం, గవర్నర్ తీరు పై స్పందించిన సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ప్రస్తుతం రామ్ లాల్ లాగా మారిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు సీపీఐ నారాయణ. ఏపీకి బిజెపి శత్రువు గా మారింది అంటూ వ్యాఖ్యానించిన సీపీఐ నారాయణ… రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. అందుకే గవర్నర్ వికేంద్రీకరణకు ఆమోదముద్ర వేశారని అన్నారు. టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బీజేపీ పై తనకున్న భ్రమను తొలగించుకొని వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది అని సూచించారు సీపీఐ నారాయణ.