గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణాకు పొంచి ఉన్న ముప్పు…!

-

తెలంగాణలో 1 శాతం పాజిటివిటీ రేట్ సాధించాము అని డీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌) డాక్టర్‌. శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం మీద 3.4% యాక్టీవ్ కేస్ రేట్ ఉంది అని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కారణంగా తెలంగాణాలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది అని ఆయన పేర్కొన్నారు. బెడ్ ఆక్యుపెన్సీ రేట్ అక్టోబర్ లో 16.5,నవంబర్ లో సుమారు 11 శాతానికి తగ్గింది అని ఆయన అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వెవ్ కొనసాగుతోంది అని తెలిపారు. ఒక వైపు చలి పెరగటం, గ్రేటర్ ఎన్నికలు జరిగాయి, పండుగలు కూడా ఉన్నాయి అన్నారు. అయిన ప్రస్తుతానికి రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలోనే ఉంది అని ఆయన వెల్లడించారు. ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు అందరూ వచ్చే వారం రోజులు ఐసోలాషన్ లో ఉండాలని కోరుతున్నామని ఆయన సూచించారు. ఇంకా 50శాతం పరీక్షా కేంద్రలను పెంచుతున్నాము అని వెల్లడించారు. హైదరాబాద్ లో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news