ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అన్ని దేశాల్లో దాదాపుగా కరోనా కేసులు నమోదు కావడం పై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు 30 లక్షల మందికి సోకింది. ఇక అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం.
ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మని దేశాల్లో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో తగ్గినట్టే తగ్గిన కేసులు ఇప్పుడు వేగంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఆదివారం 73437 కేసులు నమోదవడంతో… మొత్తం కేసుల సంఖ్య 2992841కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 206894కి చేరింది. ప్రతీ రోజు కూడా 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, బ్రెజిల్, కెనడా, ఇండియా, పెరు, సౌదీ అరేబియా, దేశాల్లో ప్రతీ రోజు కూడా రెండు వేల కేసుల వరకు నమోదు అవుతున్నాయి. అమెరికా పరిస్థితే మరీ దారుణంగా ఉందనే విషయం అర్ధమవుతుంది. అక్కడ మరణాలు వేగంగా పెరగడం తో పాటుగా వైద్య సదుపాయాలు అంధక మరికొందరు ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతుంది.