భారత్ లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

-

ఇండియాలో వరుసగా రెండవ రోజు కరోనా కేసులు లక్ష దిగువకు చేరుకున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. సోమవారం 86వేలకి పైగా కేసులు నమోదయితే మంగళవారం కేసులు 92,719గా ఉన్నాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య 2213గా ఉంది. కొత్తగా వచ్చిన కేసులతో కలిపి దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,088,176కి చేరింది. మొత్తం కరోనా మరణాలు 353,557కి చేరాయి. 18,023 కేసులతో రాష్ట్రాలన్నింటిలో తమిళనాడు టాప్ లో ఉంది. ఆ తర్వాత కేరళలో 15,023కేసులు నమోదయ్యాయి.

10,891 కేసులతో మహారాష్ట్ర, 9,808కేసులతో కర్ణాటక, 7,796కేసులతో ఆంధ్రప్రదేశ్, 5,427కేసులతో పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా చూపించిన ఢిల్లీలో కేసుల సంఖ్య 316కి పడిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ నెల జూన్ 21వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలు కానుంది. అర్హులైన వారందరికీ ఉచితంగా టీకాలు అందజేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version