వారం రోజులే డెడ్ లైన్… వ్యాక్సిన్ తీసుకోకపోతే నో ఎంట్రీ..

-

వారం రోజులే గడువు… ఆ తరువాత వ్యాక్సిన్ తీసుకోకపోతే పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతి ఇవ్వం అంటూ హెచ్చరికలు జారీ చేశారు మధురై కలెక్టర్. ఇటీవల కాలంలో తమిళనాడు వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది దీనికి తోడు కొత్తగా ఓమిక్రాన్ భయాలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో మధురై జిల్లా కలెక్టర్ కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. వారం రోజుల్లోగా కొవిడ్​ టీకా తీసుకోకపోతే.. బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించేదని లేదని ప్రజల్ని హెచ్చిరించాడు. ప్రజలు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాక్సిన్​ తీసుకోనివారికి హోటల్స్, షాపింగ్​ మాల్స్, సినిమాహాళ్లు.. తదితర వాణిజ్య సంస్థల్లోకి అనుమతి లేదని మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ హెచ్చరించారు.

మరోవైపు కర్ణాటకలో ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో  అక్కడి ప్రభుత్వం కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. రెండు డోసులు తీసుకున్నట్లు సర్టిఫికేట్ చూపిస్తేనే మాల్స్, సినిమా థియేటర్లు, పార్కుల్లోకి అనుమతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version