U-19 World Cup : టీమిండియాను వెంటాడుతున్న క‌రోనా.. నేడు క్వార్ట‌ర్ ఫైన‌ల్

-

అండ‌ర్ – 19 ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియాను క‌రోనా వైర‌స్ వెంటాడుతుంది. ఇప్ప‌టికే టీమిండియా కెప్టెన్ య‌ష్ ధుల్ తో పాటు మ‌రో న‌లుగురు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజా గా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ ముందు టీమిండియా కు షాక్ తగిలింది. జ‌ట్టు కు య‌ష్ ధుల్ దూరం అయిన త‌ర్వాత తాత్కాలిక కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆల్ రౌండ‌ర్ నిశాంత్ సింధు కు కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. నిశాంత్ సింధు కెప్టెన్ గానే కాకుండా ఆల్ రౌండ‌ర్ గా ఇప్ప‌టి వ‌ర‌కు విజ‌యాల‌లో కీల‌క పాత్ర వహించాడు.

కాగ ఇప్పుడు క‌రోనా బారిన ప‌డ‌టంతో టీమిండియా ఇబ్బందుల్లో ప‌డింది. అయితే ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ్డ కెప్టెన్ య‌ష్ ధుల్ తో పాటు మ‌రో న‌లుగురు ఆట‌గాళ్లు క‌రోనా నుంచి కోలుకున్నారు. తాజా గా వీరు నేట్ ప్రాక్టిస్ కూడా ప్రారంభించారు. అయితే నేడు జ‌ర‌గ‌బోయే క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ లో ఆడుతారా అనేది క్లారిటీ లేదు.

కాగ నేడు అండ‌ర్ – 19 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్స్ బంగ్లాదేశ్ తో టీమిండియా క్వార్ట‌ర్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా త‌లప‌డ‌నుంది. కాగ గ‌త ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాగ నేడు ఆ ప్ర‌తికారాన్ని తీర్చుకోవాల‌ని కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారు. కాగ నేటి మ్యాచ్ మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version