బీజేపీలో కరోనా కలకం.. కేంద్రమంత్రి, ఎంపీ కి కరోనా

-

దేశంలో కరోనా కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. థర్ఢ్ వేవ్ వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు వరసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. ఇదే విధంగా ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ లకు కరోనా సోకింది.

ఇదిలా ఉంటే బీజేపీ పార్టీలో కరోనా కలకలం మొదలైంది. తాజాగా ఓ కేంద్రమంత్రి, ఎంపీకి కరోనా సోకింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా సోకింది. ఆయన్ను ఢిల్లీలో ఓ ఆసుపత్రిలో చేర్చారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తెలంగాణలో కూడా ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version