భారత్ లో కరోనా మరణాల సంఖ్య 5 కి చేరింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఇటలీకి చెందిన ఒక వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అతను టూరిస్ట్ గా ఇటలీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. అతను కరోనా చివరి దశలో ఉన్నప్పుడు ఆస్పత్రిలో చేరడంతో వైద్యులు అతనికి పూర్తి స్థాయి చికిత్స ను అందించలేకపోయారని సమాచారం. అతని నుంచి ఎవరి ఎవరికి సోకింది అనేది అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇప్పటి వరకు కరోనా కారణంగా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోగా ఒకరు విదేశాలకు చెందిన వ్యక్తి. ఇక ఇదిలా ఉంటే దాదాపు 180 మందికి కరోనా వైరస్ రాగా… తెలంగాణాలో 16 మందికి కరోనా వైరస్ సోకింది. విశాఖలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
ఇక భారత్ లో కరోనా సోకినా వారిలో 40 మందికి వ్యాధి నయం అయినట్టు సమాచారం. వారిని ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేసారు. తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణా ప్రభుత్వం తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.