సింగరేణిలో ఇప్పుడు కరోనా తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడంతో సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పుడు కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో కరోనాతో పిట్టలరాల్లుతున్న కార్మికులను చూసి ప్రజలు కన్నీరు పెడుతున్నారు.
సింగరేణి వ్యాప్తంగా 100 మంది రెండోవ దశలో కార్మికుల మృతి చెందారు అని గుర్తించారు. 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు వారే ఎక్కవగా మృతి చెందారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. 25 సంవత్సరాల నిండిన ప్రతి కార్మికునికి వ్యాక్సిన్ వేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసాయి.