గిరిపుత్రుల ఆదాయానికి గండి కొడుతున్న ఆ ఎగుమతుల జాప్యం

-

ఒరిస్సా లోని రాయగఢ్ జిల్లా కొండ ప్రాంతాల్లో నివసించే గిరి పుత్రులకు అక్కడి అడవుల్లో దొరికే వస్తువులే ప్రధాన ఆదాయ వనరులు. ముఖ్యంగా పనస కాయల ద్వారా ఇప్పటి వరకు మిగిలిన వాటి కంటే కొంత ఎక్కువ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. కానీ కోవిడ్ ఆంక్షలు కారణంగా ఆదాయానికి భారీగా గండి పడింది. ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు తగ్గుముఖం పట్టినా ప్రభుత్వం నుంచి ఎగుమతులు చేసేందుకమాత్రం వీరికి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.

ఈ జిల్లా లో పండే పనస కాయలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉండటంతో జిల్లాకు చెందిన వ్యాపారులు, గిరిజన రైతులు సంయుక్తంగా ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. వీటి గిరాకీ ని దృష్టిలో పెట్టుకొని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఒడిశా జీవనోపాధి, ఒడిశా గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ సంస్థ (ఓర్మాస్ ) మదర్ డెయిరీ , రిలయన్స్ రిటైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందం ప్రకారం పనసకాయలను తమ(ఓర్మాస్) ద్వారా కొనుగోలు చేసి వాటిని రిలయన్స్ మరియు మదర్ డెయిరీ ల రిటైల్ దుకాణల ఆధ్వర్యంలో అమ్మేలా కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మొదటి కరోనా వేవ్ కన్నా రెండో వేవ్ కోవిడ్ ఆంక్షలు కట్టుదిట్టం గా ఉండటంతో గిరిపుత్రుల భారీ ఆదాయాన్ని కల్పించే ఈ ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
రాయగఢ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల టన్నుల పనసకాయల ఉత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. ఈ విషయమై ఓర్మాస్ సంస్థ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఈ ఏడాది రైతుల నుంచి పనసకాయలు సేకరించేందుకు సన్నద్ధం అవుతున్నాం అని వీటి కోసం పలు సంస్థల నుంచి ఆర్డర్స్ వచ్చినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలని గిరిజన రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news