కరోనా వైరస్ ప్రభావం ఇప్పటికిప్పుడు తగ్గదని.. ఇది దీర్ఘకాలిక సమస్య అని, దాని ప్రభావం కొన్ని దశాబ్ధాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ వెలుగు చూసి రెండు సంత్సరాలు దాటిపోతుంది. అయినా.. కరోనా వైరస్ ఏ మాత్రం బలహీన పడకుండా.. రెట్టింపు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. తనలో మ్యూటెంట్ లను మార్చుకుని ప్రమాదకరమైన వేరియంట్లతో విరుచుకుపడుతుంది.
కాగ ఇప్పుడు కరోనా వైరస్ దశబ్ధాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ ఆధానమ్ ప్రకటించారు. కరోనా వైరస్ ఎంత ఎక్కువ రోజులు వ్యాప్తి చెందితే.. అంత ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. వైరస్ ఎక్కువ సోకే వ్యక్తులకు ఈ ప్రభావం మరింత ఉంటుందని అన్నారు. కాగ ప్రపంచ వ్యాప్తంగా టీకా పంపిణీలో అసమానతలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు 23 శాతం మాత్రమే ఉందని అన్నారు. అలాగే కామెన్వెల్త్ దేశాల్లో కూడా కేవలం 42 శాతమే వ్యాక్సినేషన్ రెటు ఉందని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అసమానతలు లేకుండా.. అందరికీ వ్యాక్సిన్ అందించడమే తమ ముందున్న లక్ష్యం అని అన్నారు.