కిడ్నీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండ వీటిని పాటించండి.

-

కిడ్నీ రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండ వీటిని పాటించండి. మూత్రపిండాలలో రాళ్ళు మూత్రపిండాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలానే మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. కిడ్నీలో రాళ్ళు ( Kidney ) కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి. అయితే ఈ రాళ్ళు చిన్నవిగా ఉన్నందున, గుర్తించడం కష్టం. కానీ కొన్ని సందర్భాలలో, అవి శరీరాన్ని విడిచి మూత్రం ద్వారా విడుదల అవుతున్నప్పుడు, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. అయితే ఈ హోమ్ రెమిడీస్ ని కనుక పాటిస్తే కచ్చితంగా సమస్యల నుండి బయట పడచ్చు.

ఎండబెట్టిన తులసి ఆకులు:

తులసి ఆకుల్ని ఎండబెట్టి వేడినీటిలో వేసి ఆ టీని రోజుకి 3 సార్లు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల అది ఎసిటిక్ ఆమ్లంగా మారి కిడ్నీలో స్టోన్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది.

ఎక్కువ నీళ్ళు తాగాలి:

డీహైడ్రేషన్ కాకుండా వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. మీరు రోజుకి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.

దానిమ్మ జ్యూస్:

కిడ్నీలో రాళ్లు బయటకు పంపడానికి దానిమ్మ జ్యూస్ బాగా సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా దీన్ని కూడా తీసుకుంటూ ఉండండి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళను బయటకు పంపడానికి వీలవుతుంది కనుక ఆపిల్ సైడర్ వెనిగర్ తో కూడా పరిష్కరించుకోవచ్చు.

కిడ్నీ బీన్స్:

కిడ్నీ బీన్స్ ని 8 నుండి 12 గంటల పాటు నానబెట్టి కొద్దిగా ఇంగువ వేసి తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version