వెంకన్నకు కరోనా సెగ.. తగ్గిన భక్తుల రద్దీ..!

-

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకి అధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి. అధిక స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు బయపడిపోతున్నారు. ఈ ప్రభావం కలియుగ దైవం తిరుమల వెంకన్నపై పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. పైగా తిరుపతిలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయడం.. అలాగే టీటీడీ సిబ్బంది, ఆలయ అర్చకులకు కూడా వైరస్ సోకడంతో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు బయపడుతున్నారు.

 

అయితే మంగళవారం నాడు శ్రీవారిని కేవలం 3,962 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. లాక్ డౌన్ ఆంక్షల్లో భాగంగా ఆలయ దర్శనాలకు అనుమతించిన తరువాత నుంచి ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. దీని దెబ్బతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా తగ్గిపోయింది. వైరస్ కారణంగా శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తుంటే.. టీటీడీ అనుమతించిన సంఖ్య కంటే తక్కువగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version