విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఇక ఆ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ తప్పదా.. ?

-

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా తయారవుతుంది రోజురోజుకు మనదేశం పరిస్దితి.. కరోనా తగ్గిందని లాక్‌డౌన్ సడలిస్తే ఈ వైరస్ మరింతగా రెచ్చిపోతుంది.. మండు వేసవిలో కరోనాను లాక్‌డౌన్‌తో కట్టడిచేశారు.. ఇక వర్షాలు పడుతుండటంతో ఈ వైరస్ వ్యాప్తి అడ్డూ అదుపు లేకుండా సాగుతుంది.. ఇలాంటి పరిస్దితుల్లో మరోసారి లాక్‌డౌన్ విధించక తప్పేలా లేదు అనే వార్త జోరుగా ఊపందుకుంటుంది.. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు మరోసారి కఠినమైన ఆంక్షలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని పూర్తిగా షట్‌డౌన్‌‌కు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

ఇకపోతే ఇప్పటికే కరోనా వైరస్ తీవ్రత పంజాబ్‌లో ఎక్కువ కావడంతో వారాంతాలు, పబ్లిక్ హాలీడేస్‌ వంటి వాటి విషయాల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలుచేయాలని, కేవలం ఈ-పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గురువారం ఆదేశించారట. ఈ క్రమంలో వైద్య సిబ్బంది, నిత్యావసరాల సేవల సిబ్బంది మినహా ప్రజలు ఈ-పాస్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారట. ఇక చెన్నై విషయానికి వస్తే ఇక్కడ కూడా కరోనా మహమ్మారి స్వైరవిహారం కొనసాగుతుండటంతో నగరంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎందుకు విధించడం లేదని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. శుక్రవారంలోగా దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

 

మరో రాష్ట్రమైనా ఝార్ఖండ్‌లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌ను మిత్రపక్షం కాంగ్రెస్ కోరగా, కేరళ సైతం కఠినమైన ప్రమాణాలతో కంటెయిన్‌మెంట్ జోన్లను నిర్వచించే పద్దతిని రూపొందించాలని నిర్ణయించుకుందట.. ఇక ఇప్పటికే పరిస్దితి చేజారిపోయింది.. ఇలాంటి పరిస్దితుల్లో చేపట్టే చర్యల వల్ల ఫలితాలు వస్తాయో రావో తెలియదని కొందరు పెదవి విరుస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version