దోమల ద్వారా వైరస్… నిజమే కానీ…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎప్పుడూ చూడనంతగా నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన తాజా సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయంట. ఇదే క్రమంలో ఇప్పటికీ నిర్ధిష్టమైన మందు కనిపెట్టకపోవడంతో పెరుగుతున్న కేసులతో వైద్యులు తలలు పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పటికీ కొంతమంది జనాలు భౌతికదూరం పాటించాలనే ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడి మరీ తలకు మించిన భారం అవుతుంది. ఈ క్రమంలో… దోమల ద్వారా వైరస్ వ్యాప్తి అనే కథనాలు వెలువడుతున్నాయి.

దానీకీ కారణం లేకపోలేదు… ప్రపంచ ఆరోగ్య్య సంస్థ తాజా సమాచారం ప్రకారం.. దోమలు కుట్టడం ద్వారా మనిషి శరీరంలోకి కొన్ని వైరస్ లు ప్రవేశించడం నిజమే. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఆరోగ్యవంతుని కూడా కుట్టడంతో వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే జికా వైరస్, డెంగ్యూ జ్వరాల విషయంలో చూసి ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కరోనా విషయంలో ఉపశమనం అయిన విషయం ఏమిటంటే… వివిధ రకాల దోమలు కుట్టి వచ్చే వైరస్ లలో కరోనా వైరస్ ఉందనే విషయాన్ని ఇప్పటి వరకూ ఏ టెస్టూ బయటపెట్టలేకపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది.

ఇదే విషయాలపై మరింతక్లారిటీ ఇచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…. నేటివరకూ దోమలు కుట్టడం ద్వారా కరోనా వైరస్ సోకినట్లు ఏ సమాచారం లేదని.. కరోనా వైరస్ అనేది శ్వాస సంబంధిత వైరస్ అవ్వడం వల్ల ఇది నోటి తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని… ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా, ముక్కులో నుంచి నీరులా కారి అది ఇతరులకు తాకినా వైరస్ వస్తుందని పేర్కొంది! సో… దోమల ప్రస్తుతానికి కరోనా రాదన్న మాట… కాని దోమల విషయంలో జాగ్రత్త సుమా!

Read more RELATED
Recommended to you

Exit mobile version