తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పటి వరకు 471 మందికి కరోనా వైరస్ సోకింది రాష్ట్రంలో. వీరిలో 12 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోగా 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక మరికొందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇక తెలంగాణాలో ఎక్కువ కేసులు హైదరాబాద్ లోనే నమోదు అవుతున్నాయి. అత్యధికంగా ఇక్కడ దాదాపు 160 కేసుల వరకు నమోదు కావడం తో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా పురుషుల్లోనే నమోదు అవుతున్నాయి. 170 మందికి కరోనా రాగా అందులో 121 మంది పురుషులే. వారిలోనూ 45 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. 15 నుంచి 45 ఏళ్ల లోపు వారు 98 మంది, 15 నుంచి 29 ఏళ్లలోపు వారు 40 మంది, 30 నుంచి 45 ఏళ్లలోపు వారు 48 మంది ఉండటం గమనార్హం. 46 నుంచి 60 ఏళ్ల లోపు 42 మంది ఉన్నారని అధికారులు చెప్తున్నారు.
13 మంది పిల్లలు వైరస్ బారిన పడగా… వీరిలో కూడా బాలురే ఎక్కువగా ఉన్నారు. ఐదేళ్లలోపు బాలురు తొమ్మిది మంది ఉండగా బాలికలు నలుగురు ఉన్నారని అధికారులు చెప్తున్నారు. 35 మంది మహిళలకు కరోనా వైరస్ సోకింది. దీనితో అధికారులు 45 ఏళ్ళ పైబడిన వారు బయటకు వచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి అని వారికి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని సూచనలు చేస్తున్నారు.