కరోనా విషయంలో ప్రజలకు అవగాహన అనేది చాలా అవసరం. ప్రజల ప్రాణాలకు అవగాహనే ఇప్పుడు దాదాపుగా రక్షణ అనే విషయం అందరికి అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు ఎవరికి వారుగా ముందుకు వచ్చి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక విగ్రహాన్ని కరోనా అంతం అంటూ తయారు చేసారు. అది చాలా బాగా ప్రజలను ఆకట్టుకుంటుంది సూరత్ లో నివాసం ఆశిష్ పటేల్ ఒక విగ్రహం తయారు చేసాడు.
కరోనా కిల్లర్ గణేశ్ అనే విగ్రహాన్ని తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టాడు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేసేందుకు గానూ తాను ఈ విధంగా గణేష్ విగ్రహాన్ని తయారు చేశా అని ఆయన పేర్కొన్నారు. ఈ సారి ఉత్సవాల్లో తాము సామాజిక దూరం పాటించడమే కాకుండా మాస్క్ లు ధరించి పూజలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ విగ్రహానికి మంచి స్పందన వస్తుంది.