“మారాలి లోకేష్ – లేవాలి లోకేష్”!

-

2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ స్లోగన్.. “రావాలి జగన్ – కావాలి జగన్” అని. అయితే ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు కూడా టీడీపీ కోసం ఒక స్లోగన్ తయారుచేసుకున్నారు. అదే… “మారాలి లోకేష్ – లేవాలి”! టీడీపీ ఆశాకిరణం, భవిష్యత్ ఆశాజ్యోతి, టీడీపీ తరుపున సీఎం క్యాండిడేట్, యువకిశోరం నారా లోకేష్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అబ్దుల్ కలాం అన్న మాటలు గుర్తుచేశారు.. యువతను మరింత ఉత్సాహపరిచారు.. ఇలాటి విషయాల్లో “తనకు తానే సాటి – తనతో ఎవరూ రాలేరు పోటీ” అన్న రేంజ్ లో స్పందించారు.

“కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తిసామర్ధ్యాలను బయటకు తీసి నువ్వెంటో నిరూపించుకునేందుకు వచ్చాయి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని” అంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు యువతకి మార్గనిర్దేశం.. వినూత్న ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి నేటి యువత విజయానికి మార్గం. అందుకే, సవాళ్ళను స్వీకరించండి, గెలుపుకు ముందడుగెయ్యండి”! దీంతో… చినబాబు చేసిన ఈ ట్వీట్ సూపర్ అంటున్నారు తమ్ముళ్లు! అయితే.. ఇదే సమయంలో ఆ ట్వీట్ లోని కంటెంట్ ని చినబాబుకూడా పాటించాలని కోరుకుంటున్నారు.

అవును… కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలెదు అని గుర్తుచేసిన చినబాబు… 2019 ఎన్నికల ఫలితాల రూపంలో కూడా కష్టాలు వచ్చింది 2024లో పార్టీ మరింత బలపడటానికి అని ఎందుకు గ్రహించడం లేదు.. ఆ దిశగా ముందుకు అడుగులు వేయకుండా.. ఎందుకు చతికిలబడిపోయారు?

సవాళ్లను స్వీకరించండి, గెలుపుకు ముందడుగేయండి అని కలాం మాటలను గుర్తుచేసిన చిబాబు… కరోనా కష్టకాలంలో ఈ ప్రకృతి విసిరిన సవాళ్లను అదిగమించి ఎందుకు ముందుకుసాగలేకపోతున్నారు. తండ్రికి పెద్ద వయసు వచ్చేసింది.. వయోభారంతో ఆయన గదిలోనుంచి బయటకు రావడం లేదు.. అలాంటప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు మాస్ లీడార్ అయిన లోకేష్ కూడా.. నాలుగు గోడల మధ్య ట్విట్టర్ లో కాలక్షేపం చేస్తే ఎలా? అని ఆవేదన చెందుతున్న చినబాబు అభిమానులు… “మారాలి లోకేష్ – లేవాలి లోకేష్” అంటూ కొటేషన్స్ చెప్పి చినాబాబుని ఉత్సాహపరుస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version