కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు రానున్న మరికొన్ని నెలల్లో తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి అదుపులోకి వచ్చినా దాని ప్రభావంతో నిత్యావసర సరుకులు అదేవిధంగా కొన్ని కీలక అవసరాలు ప్రజలకు దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని వ్యాపారాలను దాదాపుగా మూసివేశారు. ప్రధానంగా ప్రజలకు అత్యవసరమైన వాటిని కూడా మూసివేసే పరిస్థితి ఏర్పడింది.
వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మాల్స్ అదేవిధంగా సూపర్ మార్కెట్లు కూడా మూసి వేసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవసరమైన కూరగాయలు, పాలు అలాగే కందిపప్పు, బియ్యం అలాగే నూనె, పంచదార వంటివి కూడా దొరికే అవకాశం లేదని పలువురు హెచ్చరిస్తున్నారు. ఉన్నాగానీ వాటిని బ్లాక్ మార్కెట్ ద్వారా భారీ ధరకు విక్రయించిన అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరింత విస్తరించే అవకాశం ఉంది కాబట్టి అందరూ నిత్యావసర సరుకులు అయినటువంటి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అలాగే నూనె వంటి వాటిని ముందుగానే కొన్ని పెట్టుకుంటే మంచిదని రానున్న కొన్ని వారాలపాటు కూరగాయలు దొరికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కూరగాయల కొరత ఎక్కువగా ఉందని అన్ని సూపర్ మార్కెట్లలో వాటిని కాళీ చేసేసారు. కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు మూడు నెలలకు పైగా సరిపడే వస్తువులను కొనుగోలు చేసుకుని పెట్టుకుంటే మంచిది అంటున్నారు.