మరోకొత్త వేరియంట్‌ కరోనా విజృంభణ

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై
విరుచుకుపడుతోంది కరోనా మహమ్మారి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలకాలంలో కేసులు గణనీయంగా తగ్గుతున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకరంగానే ఉన్నది. ఇటీవలకాలంలో అమెరికా, యూకే సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లతో కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటు మరణాలు సైతం పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరో వైపు మహమ్మారి కారణంగా సింగపూర్‌లో పరిస్థితి దిగజారుతున్నది.

తీవ్రమైన సమస్యలు ఏమి లేకపోయినప్పటికీ.. రెండు వేరియంట్ల కారణంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. మీడియా నివేదికల ప్రకారం సింగపూర్‌లో రోజవారీ కొవిడ్‌ కేసులు రెండువేల మార్క్‌ను దాటాయి. మూడువారాల కిందట రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి దిగువన ఉండగా.. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అయితే, ఇటీవల రెండు కొవిడ్‌ కొత్త వేరియంట్లను గుర్తించారు. వీటి కారణంగానే రోగుల సంఖ్య పెరుగుతోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పౌరులందరూ తప్పనిసరిగా కొవిడ్‌ ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

సింగపూర్‌లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులకు రెండు కొవిడ్‌ కొత్త వేరియంట్లే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. EG.5 వేరియంట్‌తో పాటు దాని సబ్‌ వేరియంట్‌ HK.3 ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటు ఈ రెండు ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ సబ్‌ వేరియంట్లు. ఇటీవలకాలంలో 75శాతం కేసులు పెరుగడానికి ఈ రెండు వేరియంట్లే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైరస్‌ ఉధృతిని చూస్తే.. రాబోయే రోజులు మరింత విస్తరిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఊరట కలిగించే విషయమేంటంటే రెండు వేరియంట్ల కారణంగా తీవ్రమైన సమస్యలేమీ లేవని, అంత ప్రమాదమేమి కారణం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version