వరల్డ్‌కప్‌ : ఆసీస్‌తో మ్యాచ్‌లో జడేజా రికార్డు

-

ప్రపంచ కప్ 2023 ఐదో మ్యాచ్‌లో టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్భుతాలు చేశాడు. వరల్డ్‌కప్‌లో రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. ఆదివారం నాటి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా జడేజా రికార్డు నెలకొల్పాడు. ఇవాళ్టి మూడు వికెట్లతో కలిపి ఆసీస్‌పై జడేజా తీసిన వన్డే వికెట్ల సంఖ్య 37కు చేరింది. కపిల్‌ దేవ్‌ 45 ఆసీస్‌ వికెట్లు తీసి జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 38 వికెట్లతో మహ్మద్‌ సమీ రెండో స్థానంలో నిలిచాడు. మరో రెండు వికెట్లు తీస్తే మహ్మద్‌ సమీని వెనక్కి నెట్టి జడేజా రెండో స్థానానికి చేరుకోనున్నాడు. ఇక జడేజా తర్వాత అజిత్‌ అగార్కర్‌ (36 వికెట్లు), జగగల్‌ శ్రీనాథ్‌ (33 వికెట్లు), హర్భజన్‌ సింగ్‌ (32 వికెట్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

ODI క్రికెట్‌లో, జడేజాపై స్మిత్ సగటు 100 కంటే ఎక్కువగానే ఉంది. కానీ, చెన్నైలో జడ్డూ ఈ సీనియర్ ప్లేయర్‌కు షాక్ ఇచ్చాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత తొలి బంతికే స్మిత్‌ను జడేజా అవుట్ చేశాడు. జడేజా వేసిన ఈ బంతి నిజంగా అద్భుతం. జడేజా బంతిని గాలిలోకి లోపలికి విసిరాడు. పిచ్ టచ్ చేసిన తర్వాత అది బయటికి వెళ్లింది. స్మిత్ దానిని ఆడేందుకు ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఉపయోగించాడు. కానీ, జడేజా వేసిన బంతి అతని డిఫెన్స్ గుండా వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version