భారతీయ జనతా పార్టీ వరుణ్ గాంధీ కరోనా వైరస్ బారీన పడ్డారు. ఆదివారం ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆయన స్వయంగా ప్రకటించారు. ఇన్ ఫెక్షన్ తాలూకు బలమైన లక్షణాలతో బాధపడుతున్నట్లు చెప్పారు వరుణ్ గాంధీ. ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల తరుణంలో కరోనా కేసులు గణ నీయంగా పెరిగిపోతుండడం పట్ల వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక ప్రస్తుతం వరుణ్ గాంధీ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా…. దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రీటీలు ఇలా చాలా మంది కరోనా మహమ్మారి బారీన పడ్డారు. కాగా…గడిచిన 24 గంటల్లో దేశంలో 1,59,632 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,90,611 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 10.21 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 327 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,83,790 కి చేరింది.