తెలంగాణకు వచ్చే వారికి అలెర్ట్‌..ఇక ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే ఎంట్రీ

-

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్‌ కల్‌ తో పాటు.. జహీరాబాద్‌ మండలంలోని శివారు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. సరిహద్దు దాటుతున్న వ్యక్తులకు స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించేందుకు చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండనున్నారు.

జహీరాబాద్‌ బీదర్‌ రోడ్డపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేస్‌ పూర్‌ శివారులో చెక్‌ పోస్టులో ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు పోలీసులు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు చేస్తున్నారు. నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన వారినే తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రతి వాహనాన్ని అధికారులు క్షుణంగా తనికీలు చేస్తున్నారు. బీదర్‌ లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లా అధికారులు మీర్జాపూర్‌ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version