చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన దేశంలో కరోనా రెండవ దశ కొనసాగుతుండగా… త్వరలోనే మూడవ వేవ్ రూపంలో కరోనా సోకుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇటు ఇటీవల జంతువుల్లో కరోనా లక్షణాలు బయట పడుతున్నాయి. తాజాగా అమెరికాలో పోజింగ్ కు కరోనా సోకింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందని అన్నది ఇంకా తెలియరాలేదు.
ఓహియో రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు కరోనా పరీక్షలు నిర్వహించగా… ఈ పరీక్షలు ఆ జింక కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. జంతువుల నుంచి మనుషులు- జంతువుల మధ్య కరోనా వ్యాప్తి పై ఒహియో స్టేట్ యూనివర్సిటీ కి చెందిన వెటర్నరీ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అయితే ఈ అధ్యయనంలో భాగంగా జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహించగా… అందులో ఒక జింకకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు బయటపడింది. ఇక ఇప్పటివరకూ కుక్కలు, గొరిల్లాలు, చిరుతలు మరియు సింహాలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే కానీ జింకకు కరోనా రావడం ఇదే తొలిసారి.