BREAKING : గుత్తా జ్వాల భ‌ర్త హీరో విష్ణు విశాల్‌కు క‌రోనా పాజిటివ్‌

-

చిత్ర పరిశ్రమలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖులకు కరోనా పాజిటివ్‌ రాగా… ఇప్పుడు ఈ వైరస్‌ తాకిడి కోలీవుడ్‌ ను కూడా అంటుకుంది. తాజాగా బాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల భర్త హీరో విష్ణు విశాల్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్‌ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

” నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. భయంకరమైన ఒళ్లు నొప్పులు, ముక్కు దిబ్బడ, గొంతు దురద, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు ఉన్నాయి. త్వరలో బౌన్స్‌ బ్యాక్‌ అవుతా” అంటూ హీరో విష్ణు విశాల్‌ పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలిసన ఆయన అభిమానులు.. హీరో విష్ణు విశాల్‌ త్వరగా కోలుకోవాలని కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే మహేష్‌ బాబు, మంచు మనోజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, మంచు లక్ష్మి, వరలక్ష్మి,విశ్వక్‌ సేన్‌ తదితరులు కరోనా బారీన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version