BREAKING : ‘పాగల్‌’ హీరో విశ్వక్‌ సేన్‌ కు కరోనా పాజిటివ్‌

-

చిత్ర పరిశ్రమ లో కరోనా కల్లోలం సృష్టి స్తోంది. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి బారీన చాలా మంద్రి సెలబ్రీటీలు పడగా.. తాజాగా… మరో టాలీవుడ్‌ స్టార్‌ కు కరోనా సోకింది. యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో విశ్వక్‌ సేన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

”నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి కరోనా పరీక్షల్లో ఈ విషయం బయట పడింది. దీంతో డాక్టర్ల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌ లో ఉన్నాను. కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ… ఈ మహమ్మారి సోకుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు, భౌతిక దూరం పాటించండి. బయట అనవసరంగా తిరగొద్దు” అంటూ విశ్వక్‌ సేన్‌ ట్వీట్‌ చేశాడు. కాగా… రెండు రోజుల క్రితం.. హీరో మంచు మనోజ్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version