కరోనా మహమ్మారి ప్రజలందరినీ కూడా భయపెడుతోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న విఫలమవుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మస్క్స్ వంటివి ధరించడం మాత్రమే చేయగలుగుతున్నాము. ఏది చేసినా ఈ ఉద్రిక్తత మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ మహమ్మారిని ఆపడానికి కుదరడం లేని పని అవుతోంది. శనివారం నుంచి బెంగుళూరు లో 20వేల ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులని చేయనున్నారు. ఈ విషయం కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి సుధాకర్ శుక్రవారం ప్రకటించారు.
బెంగళూరులో ఇప్పటికే యాంటిజెన్ టెస్ట్లు ప్రారంభించారు బెంగళూరు నగరంలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా పెరిగిపోవడంతో ర్యాపిడ్ యాంటిజన్ టెస్టులతో కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే కరోనా కేసులు ఎలా అయినా తగ్గించాలి అంతే కాకుండా ప్రజలు ఆరోగ్యంగా సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తోంది అయితే ర్యాపిడ్ యాంటిజన్ టెస్టుల విషయానికి వస్తే బెంగళూరు లో శుక్రవారం ఒక్క రోజే 1447 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి .
ఈ మహమ్మారి ఇటువంటి కఠిన దుస్థితికి తీసుకువెళ్ళింది ప్రజలని. మరోపక్క కరోనా మరణాలు కూడా ఐటి నగరాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే బెంగళూరు నగరంలో కరోనా కారణంగా 29 మంది మరణించారు. అయితే ప్రస్తుతం ర్యాపిడ్ యాంటిజన్ టెస్టింగ్ జరుగుతోంది. ఈ టెస్ట్ చేస్తే ఇంకా ఎన్నో కేసులు బయట పడవచ్చని సందేహం వ్యక్తం అయింది.
అయితే మన శరీరంలోకి చేరిన రోగకారకాని యాంటీజన్ అని అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు వెంటనే రోగనిరోధక వ్యవస్థ మోహరించి రక్షకభటుల యాంటీబాడీలు. ఈ యాంటీజన్ గుర్తించడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అని పరీక్షలు చేయడం జరుగుతుంది వైరస్ సోకిన కొద్ది గంటల్లో ఈ టెస్ట్ కనుక చేస్తే పాజిటివ్ చూపిస్తుంది ఒక వేళ కరోనా లేకపోతే నెగిటివ్ చూపిస్తుంది ఇలా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆర్ డి పీ సి ఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఒకవేళ అందులో పాజిటివ్ వస్తే కరోనా వచ్చింది అని తెలిసిపోతుంది.