తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భయాందోళనను కలిగిస్తుంది. ఈ రోజు గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోలిస్తే.. దాదాపు 579 కేసులు నేడు పెరిగాయి. కాగ గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 1,13,670 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,559 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో 3,980 కేసులు నమోదు అయ్యాయి. ఇదీల ఉండగా ఈ రోజు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,450 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు కరోనా కాటుకు మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల మృత్యవాత పడ్డ వారి సంఖ్య 4,077 కి చేరింది. అలాగే నేడు రాష్ట్రంలో 1,961 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో నేడు రాష్ట్రంలో ప్రస్తుతం 36,269 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగ తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి కరోనా కేసులు కాస్త తగ్గిన ఊరట ఇచ్చినా.. నేడు మాత్రం కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. అయితే మన రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు పది శాతం లేదని డీ హెచ్ శ్రీనివాస్ తెలిపారు. పది శాతం పాజిటివిటీ రేటు దాటితే.. నైట్ కర్ఫ్యూతో పాటు మరి కొన్ని ఆంక్షలు విధిస్తామని ఈ రోజు ప్రకటించారు.