రాష్ట్రం ప్రభుత్వ కీలక నిర్ణయం… కరోనా నేపథ్యంలో మరోసారి ఫీవర్ సర్వే

-

పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్, వ్యాధి వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేయలాని వైద్య శాఖను మంత్రి ఆదేశించారు. సర్వేలో జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి వారందరికి మెడికల్ కిట్లు అందించాలని ఆదేశించారు. కరోనా పెరగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలిని అధికారులకు సూచించారు. మరోవైపు అన్ని ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ నిర్వలను 350 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నట్లు హరీష్ రావు తెలిపారు. కరోనాలకు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నా.. ఏఎన్ఎం సెంటర్లకు కానీ.. బస్తీ దవాఖానాలకు కానీ వెళ్తే ఐసోలేషన్ కిట్లను అందచేస్తారని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version