బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డాకు క‌రోనా

-

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీల‌కు, రాజ‌కీయ నాయ‌కులకు క‌రోనా సోకుతుంది. ఇప్ప‌టికే బీహార్ సీఎం నితీస్ కుమార్, క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తో పాటు కేంద్ర ర‌క్ష‌ణా శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు కూడా క‌రోనా వైర‌స్ సోకింది. తాజా గా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌య‌ప్ర‌కాశ్ న‌డ్డా కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు.

త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని తెలిపారు. దీంతో వైద్యుల‌ను సంప్ర‌దించాన‌ని.. వైద్యుల స‌ల‌హా మేర‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్నానని తెలిపారు. ఈ టెస్టులో త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. అయితే ప్ర‌స్తుతం త‌ను ఆరోగ్యాంగానే ఉన్నాన‌ని తెలిపారు. వైద్యుల సూచ‌నతో హోం ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్టు తెలిపారు. కాగ త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని కోరారు. కాగ బీజేపీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా ఇటీవ‌ల హైద‌రాబాద్ కు వ‌చ్చి బండి సంజ‌య్ అరెస్టును ఖండిస్తు ర్యాలీ నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version