కరోనా… మార్చి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్…!

-

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో కీలక ముందడుగు వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగం చేసిన ప్రభుత్వం.. తాజాగా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటివారం నుంచి 12- 14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కోవిడ్ వర్కింగ్ గ్రూప్ న్​టీఏజీఐ ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే అరోరా క్లారిటీ ఇచ్చారు. మార్చిలో 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇప్పటికే 15-18 ఏళ్ల వయసున్న టీనేజర్లకు జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్  ప్రారంభించింది. 15-18 ఏళ్ల వయస్సులో ఉన్న 7.4 కోట్ల మంది పిల్లలలో, 3.45 కోట్ల మందికి పైగా ఇప్పటికే కోవాక్సిన్ మొదటి డోస్‌ను తీసుకున్నారు.. వారిందరికి 28 రోజుల్లో రెండో డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశంలోని వయోజనులందరికీ.. ఇప్పటికే 156 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. వీటిలో 90 కోట్ల మొదటి డోసులు ఇవ్వగా.. 66 కోట్ల రెండో డోస్ పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version