టీనేజర్లకు వ్యాక్సిన్… 3 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సినేషన్

-

దేశంలో కోవిడ్ మళ్లీ పెరగుతోంది. ఇప్పటికే రోజూ వారీ కేసుల సంక్య 2లక్షల మార్క్ ను దాటింది. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 5వేలకు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు కఠినతర ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కరోనా వ్యాక్సిన్ మాత్రమే ఆయధమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా కట్టడిలో భాగంగా 15-18 ఏళ్లు ఉన్న టీనేజర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. జనవరి 3న ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 3 కోట్ల మంది టీనేజర్లు తమ మొదటిడోసును తీసుకున్నారు. రానున్న కాలంలో మరింతగా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version