ఈరోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా వాక్సిన్ డ్రై రన్ జరగనుంది. తెలంగాణాలో హైదరాబాద్, మహబూబ్ నగర్ లలో ఈ వాక్సిన్ డ్రై రన్ చేపట్టనున్నారు అధికారులు. వాక్సిన్ పంపిణీలో తలెత్తే సమస్యల గుర్తింపు కోసం ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 4 సెంటర్లలో వ్యాక్సిన్ డ్రైరన్ జరగనుంది. ఒక్కో సెంటర్‌లో 25 మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్య బృందం నిర్వహించనునుంది. తిలక్ నగర్ పి.హెచ్. సి,నాంపల్లి ఏరియా ఆసుపత్రి,గాంధీ ఆస్పత్రి లో డ్రై రన్ నిర్వహించనున్నారు వైద్యులు.
ఇక ఏపీ విషయానికి వస్తే 13 జిల్లాల్లో డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ మూడు కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రంలో 25 మందికి డమ్మి వ్యాక్సిన్ వేయనున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే డ్రై రన్ నిర్వహించినా.. మరోసారి చేపట్టనున్నారు అధికారులు. డ్రై రన్ నిర్వహాణకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ ని కేంద్రానికి నివేదించనుంది రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్. కృష్ణా జిల్లాలో చిన్నపాటి సాంకేతిక లోపాలు మినహా డ్రై రన్ సాఫీగా సాగింది.