కరోనాను ఫుట్ బాల్ తన్నినట్టు తన్నిన ఇండియా…? సూపర్ మరి…!

-

దేశంలో కరోనా తీవ్రత పరిస్థితి ఏంటీ…? అసలు కరోనా విషయంలో ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంది…? కరోనా ఉందని అనుకుంటున్నారా…? అసలు కరోనాకు ప్రజలు కంగారు పడుతున్నారా…? కరోనా వలన నష్టాలు ఏమైనా ఉన్నాయి అని ప్రజలు అనుకుంటున్నారా…? మార్చ్ లో కరోనా పేరు వింటే జనాలకు నిద్ర పట్టలేదు అనే మాట వాస్తవం. చాలా వరకు కూడా ప్రజలు ఇళ్ళకు రాకుండా కేంద్రం విధించిన లాక్ డౌన్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే.

కాని ఇప్పుడు మాత్రం ప్రజల ఆలోచన మారింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రజలు ఎవరూ కూడా కరోనా వైరస్ ని సీరియస్ గా తీసుకోవడం లేదనే విషయం అర్ధమవుతుంది. దేశంలో కరోనా కేసులు తగ్గడానికి ప్రభుత్వ చర్యలే కారణం అని మీడియా ముందు ప్రభుత్వం చెప్పేది నిజం కానే కాదు. ఎలా అనేది చూడండి. కరోనా లక్షణాలు కనపడితే సినిమా టికెట్ కోసం ఎదురు చూసినట్టు ఆస్పత్రుల వద్ద ప్రజలు పరిక్షల కోసం ఎదురు చూసారు. కాని ఇప్పుడు ఎవరికి వారుగా వైద్యం చేసుకుంటున్నారు.

వాసన లేకపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్ళడం మానేశారు. కుటుంబం మొత్తానికి వచ్చినా సరే చాలా వరకు ఇంట్లో ఉండి ఆవిరి పట్టడం, దానికి సంబంధించి విటమిన్ టాబ్లెట్ లు, ఆహార నియమాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి చేయడం, ఏసీలో పడుకోకుండా ఉండటం వంటివి చేస్తున్నారు. అందుకే ఇండియాలో కరోనా కేసులు ఎక్కువగా కనపడటం లేదట. ఆస్పత్రికి వెళ్లి పరిక్షలు చేయించుకుని, రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, రిపోర్ట్ నిజమో కాదో తెలియదు.

ఆ రిపోర్ట్ వచ్చే లోపు ఏదైనా జరగోచ్చు. కాబట్టి ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికి వారుగా ఆందోళన చెందకుండా వృద్దులు కూడా చికిత్స తీసుకుంటున్నారు. చికెన్, మటన్, గుడ్లు, చేపలు వంటి ఆహరం ఎక్కువగా తీసుకోవడం, ఎండలో నిలబడటం, ఆవిరి పట్టుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, పల్స్ చెక్ చేసుకోవడం ద్వారా స్వీయ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియాలో కేసులు తగ్గడానికి కచ్చితంగా ప్రభుత్వ చర్యలు కాదు ప్రజల్లో మార్పు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version