ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు గుడికి వెళ్ళాలి అంటే చాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేసే ఉద్యోగులకు కరోనా సోకడంతో చాలా మంది భక్తులు ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆలోచిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలంలో కూడా ఇప్పుడు కరోనా కేసులు పెరగడంతో దేవాలయాన్ని 7 రోజులు మూసి వేసారు.
అదే విధంగా తెలంగాణాలో మరికొన్ని దేవాలయాలు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అందుకే ఇప్పడు చాలా మంది భక్తులు దేవాలయాలకు వద్దు అని భావిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న దేవాలయాలకు కూడా ఏదైనా అవసరమైన కార్యక్రమం అనుకుంటే మాత్రమే వెళ్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. తిరుమలలో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.