కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయాన్ని బుధవారం నుండి ఏకంగా వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. ఇందుకు ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి గాను కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అవ్వడంతో పాటు, ఆలయానికి చెందిన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి అలాగే ఇద్దరు పరిచారికలు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలయం మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
శ్రీశైలమల్లన్న ఆలయాన్ని మూసి వేసే విషయాన్ని దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితోనే చేస్తున్నామని ఆలయ ఈవో మీడియా పూర్వకంగా తెలియజేశారు. భక్తులకు దర్శన భాగ్యం నిలిపి వేసినా, స్వామి అమ్మవార్లకు మాత్రం నిత్యం నిత్యకైంకర్యాలు, అలాగే ఇతర సేవలను తప్పకుండా నిర్వహిస్తామని ఆలయ ఈవో తెలియజేశారు. ఇకపోతే కర్నూలు జిల్లాలో నేటి వరకు 3823 కేసులు నమోదయ్యాయి. ఇక ఇందులో 2105 మంది సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం జిల్లాలో 1610 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.