గతేడాది డిసెంబర్ నెలలో.. అంటే.. శీతాకాలంలో అటాక్ అయిన కరోనా వైరస్.. ప్రతి ఏటా అదే సీజన్‌లో దాడి చేసేందుకు అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి శరీరంలో వైరస్ కణాలు ఏదో ఒక విధంగా నిద్రాణమై ఉంటాయని.. అయితే అవి సీజన్‌లో మళ్లీ ఉత్తేజమై వైరస్ తిరగబెట్టేందుకు అవకాశం ఉంటుందని చైనాకు చెందిన ఏపెక్స్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పాతొజెన్ బయాలజీ విభాగం డైరెక్టర్ జిన్ కీ తెలిపారు.
ఇక కరోనా వైరస్ ప్రస్తుతానికి నాశనం చెందినా.. సీజన్ల ప్రకారం అది మళ్లీ దాడి చేసేందుకు అవకాశం ఉంటుందని గతంలో పలువురు అమెరికా సైంటిస్టులు కూడా చెప్పారు. ఈ క్రమంలో వైరస్ రాకుండా వ్యాక్సిన్ కనిపెడితేనే దానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు.
కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టులు దృష్టి పెట్టారు. అయితే ఎంత వేగంగా పనిచేసినా సరే.. ఆ వ్యాక్సిన్ వచ్చేందుకు మరో 8 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా మళ్లీ వచ్చే శీతాకాలంలో దాడి చేయకుండానే అప్పటి వరకు సైంటిస్టులు వ్యాక్సిన్‌ను తయారు చేయాలని ఆశిద్దాం..!