కరోనా ల‌క్ష‌ణాల లిస్ట్‌లో మరో కొత్త ల‌క్ష‌ణం..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. మాస్క్, సానిటైజర్ లేనిదే ప్రజలు అడుగు బయట పెట్టలేక పోతున్నారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ కి సంబంధించిన కొత్త లక్షణాలు రోజుకోకటి బయటపడుతున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే లక్షణాలుగా మనకు తెలుసు. ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి. ఇవే ఇప్పుడు భయపెడుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందని, విరోచనాలు కూడా అవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.

 

అయితే తాజాగా.. ఎక్కిళ్లు రావడం కూడా కరోనా లక్షణం అయుండొచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. చికాగోకు చెందిన ఓ 62 ఏండ్ల వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, అతడిలో కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ, టెస్ట్‌ లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.. కాగా, ప్రస్తుతం అత‌ను కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో గంటల తరబడి ఎక్కిళ్లు అలాగే వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాల్సిందేని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version