సింహాద్రి ఆట కట్టించిన ఏపీ పోలీసులకు ప్రతిష్టాత్మక అవార్డు..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం-నేరాల ఛేదింపులో ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి ఇస్తున్న ప్రతిష్టాత్మక ABCD  అవార్డుల్లో మొదటి A కేటగిరీ అవార్డుకు ఎంపికైన ఏలూరు సబ్ డివిజన్ పోలీసులు. గత ఏడాది ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రైమ్ కేసులో ఎటువంటి క్లూస్ లేకున్నప్పటికీ మాయ మాటలతో ప్రసాదం లో సైనిడ్ కలిపి నిర్దాక్ష్యణ్యంగా హత్య చేసిన నేరాన్ని ఛేదించిన కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

నిందితుడు ఆ హత్యతో పాటు గతంలో కూడా ఇదే తరహాలో బాహ్య ప్రపంచానికి తెలియకుండా డబ్బు, బంగారం కోసం చేసిన మరో 9 హత్యలను సైతం విచారణలో బయటపెట్టి మొత్తం 10 హత్యలు చేసిన ముద్దాయిని ఏలూరు సబ్ డివిజన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో సంచలనమైన వెల్లంకి.సింహాద్రి అలియాస్ సైనేడ్ సింహాద్రి వరుస హత్యల కేసును ఛేధించి…. చట్టం కళ్ళుగప్పి ఏ నేరస్తుడూ తప్పించుకోలేడని నిరూపిస్తూ నేర విచారణలో అత్యంత ప్రతిభ కనబరిన ఏలూరు సబ్ డివిజన్ కి రాష్ట్ర పోలీస్ శాఖ ABCD అవార్డుల్లో మొదటి కేటగిరీ A అవార్డుకు ఎంపిక అయ్యారు.

సైనేడ్ సింహాద్రి కేసుకు సంబందించి విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనపరచిన విచారణా అధికారి ఏలూరు డి.యస్.పి డాక్టర్ ఓ.దిలీప్ కిరణ్, ఆయన పర్యవేక్షణలో కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన ఏలూరు రూరల్ సిఐ అనసూరి. శ్రీనివాసరావు సిబ్బంది, ఎస్ఐ చావా.సురేష్, ఏ ఎస్ ఐ డి, పూర్ణచంద్రరావు, కానిస్టేబుళ్ళు ఏ. నాగేశ్వరరావు, వి. సీతయ్య, ఎన్. కిషోర్ ల బృందం రాష్ట్ర  డి.జి.పి గౌతమ్ సవాంగ్, ఐ.పి.యస్ ,వారి  చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version