ఏపీ లో మరింత పెరిగిన కరోనా కేసులు….తెలంగాణా ను కూడా దాటి మరీ….

-

తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు చాప కింద నీరులా ఉన్న ఈ వైరస్ ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఈ కరోనా లక్షాణాలు ఉన్నట్లు గుర్తించడం తో ఈ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందినట్లు గుర్తించిన అధికారులు ఇప్పుడు వారిని పట్టుకొనే పనిలో పడ్డారు. అయితే బుధవారం కూడా కరోనా కేసులు ఏపీ లో పెరగడం తో తెలంగాణా ను దాటి మరి ఏపీ లో పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం గమనార్హం.

మరోపక్క పక్క రాష్ట్రం తెలంగాణా లో కూడా ఒక్క రోజులో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఏపీ లో కూడా పరిస్థితి మరి దారుణంగా తయారైనట్లు తెలుస్తుంది. బుధవారం ఒక్కరోజే కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో ఒక్కసారిగా ఈ సంఖ్య తెలంగాణా రాష్ట్రాన్ని కూడా దాటి ఏకంగా 111 కు చేరినట్లు తెలుస్తుంది. ఏపీ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 111 కు చేరినట్లు సమాచారం. అనంతపురం 2, చిత్తూరు 6,తూ.గో 9, గుంటూరు 20, కడప 15, కృష్ణా 15, కర్నూలు 1, నెల్లూరు 3, ప్రకాశం 15, విశాఖ 11, ప.గో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అయిన ఈ వైరస్ 17వందల మందికి పైగా సోకగా,45 మంది మృత్యువాత పడ్డారు.

కరోనా కు అడ్డుకట్ట వేయడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ కూడా ప్రకటించారు. దీనితో చాలా మంది ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఢిల్లీ ప్రార్ధన విషయం బయటకు రావడం తో ఒక్కసారిగా ఈ కరోనా వైరస్ మహమ్మారి మరింత పెరిగిపోయింది. ఉదయం వరకు 87 కేసులు మాత్రమే ఉండగా వాటిలో 70 కేసులు ఢిల్లీ ప్రార్ధనల లో పాల్గొన్న వారివే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version