కొన్ని కలలు కలలుగానే ఉంటే మంచిది : ఆనంద్ మహీంద్రా

-

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, ప్రేరణ కలిగించే వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేశారు. దీనిపై తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. సముద్రంలో ఒక విలాసవంతమైన నౌకలో ఒక మహిళా సాహసమే చేసింది. ఎన్నో అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకింది. చిన్న పొరపాటు జరిగిన పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు.

కొన్ని పనులు ప్రయత్నించడం కంటే గమనించడమే మేలు అంటూ రాసుకొచ్చారు. “నేను ఈరోజు ఒక కల కన్నాను ఒక విలాసవంతమైన నౌకలో ఈ రకమైన దైవం ఎలా చేయాలో నేర్చుకోవాలని భావించాను. అయితే కొన్నిసార్లు కలలు కలలుగానే ఉంటేనే బాగుంటుంది వాటిని దూరం నుంచే గమనించడం మేలు” అని ట్వీట్ చేశారు. “నేను మాత్రం ఇలాంటి కళ చూడాలనుకోవడం లేదు” ఇది చాలా భయంగా ఉందని ఒకరు.. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యం కావాలని పొరపాటు జరిగితే అంతే అని మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version