నేడు మూసీ బాధితుల దగ్గరకు కేటీఆర్

-

అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

BRS working president KTR will go to the victims of Musi catchment area today

ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది. అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో భేటీ కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఇక అటు బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version