కరోనా వారియర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కరోనా వారియర్స్ ముందుకు రాకపోతే ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి. అలాంటి కరోనా వారియర్స్ విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ అలసత్వంగా వ్యవహరిస్తుందట. ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల వారు రోడ్డు మీదకు వచ్చారు. కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా బస్ లలో కోవిడ్ టెస్టులు వారు నిలిపివేశారు. కరోనాతో పోరాటం చేస్తు ప్రజలకు సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అడుగుతుంటే తమను బెదిరిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని కన్నీటి పర్యంతం అయ్యారు. మాపై పూలు జల్లడం కాదు మా ఆకలి బాధలు తీర్చాలని కోరారు.