ప్రాణాలతో వికృత క్రీడ… స్లమ్స్ లో డ్రగ్ ప్రయోగం!

-

అది ఒక భారీ మురికివాడ… ఆ మురికివాడ లో ఇప్పటికే కరోనా కేసులు 100కు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ మురికివాడల జనాలపై ఇది కరోనాకు మందుగా పనిచెయ్యోచ్చేమో అనే హోప్స్ ఉన్న ఒక డ్రగ్ ప్రయోగించబడుంది! దీనికోసం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 50 వేల మందికి.. గుండె, కాలేయ వ్యాధులు లేనివారికి మోతాదు మేర ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. 25-30 ఇళ్లకు ఒకరిని నియమించి ఈ మందును సుమారు 4500 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను వినియోగించి పంపిణీ చేయబోతున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు, ముంబై మీడియా నుంచి ఈ విషయాలపై కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకూ ఆ మురికివాడ మరేదో కాదు… ముంబై లోని అతిపెద్ద మురికివాడ అయిన “ధారావి”!

కరోనాకు ఇప్పటివరకు మందు లేదనే సంగతి తెలిసిందే… అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కొద్దిరోజుల క్రితం కరోనాపై ‘హైడ్రాక్సి క్లోర్లోక్విన్’ ఉపయోగించాలని.. దీని ద్వారా కరోనా తగ్గుతుందని సూచించడం… భారత్ నుంచి పెద్ద ఎత్తున ఈ డ్రగ్ ను తమ దేశంలోకి దిగుమతి చేసుకోవడం.. దీనిని ‘మ్యాజిక్ డ్రగ్’ అని కూడా ముద్దుగా పిలుచుకోవడం టపా టపా జరిగిపోయాయి! అయితే… డాక్లర్ల పర్యవేక్షణ లేకుండా ఈ డ్రగ్ తీసుకోవద్దని స్పష్టం చేసినా కూడా.. కరోనాకు ఇదే మందు అని భ్రమపడిన ఒక న్యూయార్క్ మహిళ ఆ డ్రగ్ వాడి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకొన్న సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రాక్సిక్లోర్లోక్విన్ అధిక వినియోగం డేంజర్ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇప్పటికే హెచ్చరించింది కూడా. ఇంత హడావిడి చేస్తున్న ఈ డ్రగ్ కరోనా వైరస్ సోకిన వారి చికిత్సకు పనిచేస్తుందని ఇప్పటివరకూ అధికారికంగా నిరూపించబడలేదు. కాకపోతే… రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కరోనా తగ్గిస్తుందని తేలింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ మందును పరీక్షించడానికి మురికివాడ ధారావిని అధికారులు ఎంచుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే… మనుషుల ప్రాణాలతో ఆడే ఈ వికృత క్రీడను ఆపాలనే అంతా కోరుకోవాలి! ఈ విషయాలపై స్థానిక మీడియా కూడా కథనాలు అందిస్తుంది. ఒకపక్క మీడియా భయం అలా ఉంటే… ప్రభుత్వం మాత్రం ఈ డ్రగ్ కరోనాను తగ్గిస్తుందని బలంగా చెబుతుందట! దీంతో ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదనే అనుకోవాలి. మరి… ఈ మురికివాడల్లోని పేదలపై ఈ కరోనా మందు పనిచేస్తుందా? లేక.. వారి ప్రాణాలు తీస్తుందా? అనేది వేచి చూడాల్సిందే!!

Read more RELATED
Recommended to you

Exit mobile version