ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవినీతి.. సీఎం రేవంత్‌కు అనుచరుల లేఖ

-

అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవినీతి చేశాడంటూ సీఎం రేవంత్ రెడ్డికి మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేఖ రాసినట్లు తెలుస్తోంది.ఎన్నికలకు ముందు డబ్బులు లేవని అప్పులు తీసుకున్న వాకిటి శ్రీహరి, ఇప్పుడు తన ఇంటి పక్కనున్న మరో ఇల్లును రూ.1కోటి 50 లక్షలు పెట్టి ఎలా కొన్నాడని లేఖలో ప్రశ్నించారు.

అలాగే లహరి కన్వేషన్ పక్కన 100 గజాల స్థలం, హైదరాబాద్‌లో 5 ప్లాట్లు, భూత్పూర్ దగ్గర 10 ఎకరాల భూమి, కుటుంబసభ్యులు తిరగడానికి 5 కార్లు ఎలా వచ్చాయని అందులో పేర్కొన్నారు. వైన్ షాపులో పని చేసే నాగరాజు అనే వ్యక్తి వాకిటి శ్రీహరి గెలిచాక కోట్ల రూపాయలకు ఎలా పడగెత్తాడని నిలదీశారు. వాకిటి శ్రీహరి అనుచరులు కల్లు వ్యాపారం చేసుకునే గౌడ కులస్థులతో మామూళ్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే మక్తల్ మొత్తం నాశనం అవుతుందంటూ సీఎం రేవంత్‌, పలువురు పెద్దలకు మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేఖ రాశారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twittercom/TeluguScribe/status/1892474207130321280

 

Read more RELATED
Recommended to you

Latest news