స్టాండింగ్ కమిటీ ఎన్నిక పోటీ నుండి BRS కార్పొరేటర్లు తప్పుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో పోటీ చేసేందుకు గతవారం నామినేషన్ దాఖలు చేసారు ఇద్దరు బిఆర్ఎస్ కార్పొరేటర్లు. కానీ స్టాండింగ్ కమిటి ఎన్నికలో గెలిచేందుకు సరైన సంఖ్యా బలం లేక ఉపసంహరణ దిశగా బిఆర్ఎస్ కార్పొరేటర్లు అడుగులు వేస్తున్నారు. ఈ రోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు అడ్డగుట్ట బిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి.. అడ్డగుట్ట కార్పొరేటర్ నామినేషన్ ఉపసంహరణ తో 16 కు చేసింది నామినేషన్ల సంఖ్య.
మరో ఒక్క నామినేషన్ విత్ డ్రా అయితే.. ఏకగ్రీవం కానుంది స్టాండింగ్ కమిటీ. నామినేషన్ ఉపసంహరణకు రేపే చివరి రోజు. రేపు మధ్యాహ్నం వరకు కూకట్పల్లి బిఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటల తరువాత ఏకగ్రీవం కానుంది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. ఈ సారి స్టాండింగ్ కమిటీ లో మొదటి సారి సభ్యులుగా ఉండనున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఏకగ్రీవం తరువాత స్టాండింగ్ కమిటీ లో ఉండనున్నారు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎనిమిది మంది ఎంఐఎం కార్పొరేటర్లు.