ఖాళీగా ఉండటం దేనికి.. ఇదిగో మహిళల కోసం లాభసాటి వ్యాపారం

-

ఈ రోజుల్లో ఫ్యాషన్ రంగం క్రమంగా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఫ్యాషన్ రంగం మీద ఆసక్తి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా జ్యుయేలరి, వస్త్రాల మీద గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి చూపిస్తున్నారు. దీనినే మంచి వ్యాపారంగా చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు గ్రామాల్లో ఉండే చిన్న చిన్న పిల్లలు, కాలేజి విద్యార్ధులు ఫ్యాషన్ కి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వారిని లక్ష్యంగా చేసుకుని మీరు వస్త్రాలు, చిన్న చిన్న రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకాలు మొదలుపెడితే మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న… తిర్పూర్ సహా అనేక ప్రాంతాల్లో హోల్ సేల్ గా మార్కెట్లు ఉన్నాయి. అక్కడ 20 నుంచి 50 రూపాయల తక్కువ ధరకు హోల్ సేల్ గా విక్రయించి… గ్రామాల్లో అమ్మకాలు చేయవచ్చని, ఉదాహరణకు మీరు అక్కడ 30 రూపాయలకు కొనుగోలు చేస్తే… మీ గ్రామంలో… 90 నుంచి 130 వరకు విక్రయించవచ్చని, షాపుల వాళ్ళు చేసేది ఇదేనని అంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ వస్త్ర దుకాణాల్లో ఎక్కువగా ఈ మార్కెట్ ఏ నడుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు అక్కడ పరిచయాలు పెంచుకుంటే ఇంకా తక్కువధరకు వస్తాయని, ఇక మీరు అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోతే మీకు కావాల్సిన వాటిని ఆర్డర్ ఇస్తే… వాళ్ళే కొరియర్ కూడా చేస్తున్నారని, గ్రామాల్లో ఇప్పుడు వీటికి ఎక్కువ డిమాండ్ ఉందని అంటున్నారు. చిన్న పిల్లలు, కాలేజి విద్యార్ధులు ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళ టీ షర్ట్స్, ఫాంట్స్ వంటివి కూడా అక్కడ చాలా తక్కువ ధరకు లభిస్తాయని, ఇక్కడ 300 నుంచి 500 వరకు అమ్మేవి అక్కడ మీకు 90 నుంచి 120 లోపు, దొరుకుతాయని సూచిస్తున్నారు…

గ్రామాల్లో ఏదైనా వ్యాపారాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు వీటి మీద దృష్టి పెడితే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు. ఇక పక్కన గ్రామాల్లో వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తే… వాళ్ళతో కలిసి మీరు ఈ వ్యాపారం చేయవచ్చని అప్పుడు మీకు దిగుమతి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జ్యుయేలరి విషయంలో కూడా ఈ వ్యాపారం మంచిది అంటున్నారు… హైదరాబాద్ లోని చార్మినార్, విజయవాడ వన్ టౌన్ ప్రాంతాల్లో తక్కువధరకు షాపులకు ఇస్తారని… వీటి నుంచి మంచి లాభాలు పొందవచ్చని అంటున్నారు. అయితే ఎంపిక విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version