హైదరాబాద్‌లో కల్తీ పెట్రోల్ దందా..!

-

ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రోజురోజుకు ధరలు పెరగడంతో ఇదే అదునుగా భావించి కొందరు కల్తీ పెట్రోల్ దందాను నడుపుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90పైకి పెరిగింది. పెట్రోల్ డిమాండ్ పెరగడంతో కొందరు అక్రమార్కులు పెట్రోల్‌ను కల్తీ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పెట్రోల్ ధరలు పెరగడంతో.. అందులో నీళ్లను పోసి అమ్ముతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

petrol

రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి బడేమియా పెట్రోల్ బంక్‌లో అక్రమార్కులు పెట్రోల్‌లో నీళ్లు కలుపుతున్నారు. ఈ విషయం తెలియక పెట్రోల్ బంక్‌కు వచ్చే వాహనదారులు కల్తీ పెట్రోల్‌ను పోయించుకుంటున్నారు. అలా పెట్రోల్ పోయించుకున్న వాహనాలు నడవకపోవడంతో అసలు సమస్య బయట పడింది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంక్ నిర్వాహకుడిని నిలదీశారు. పెట్రోల్‌లో నీళ్లు పోసి ఎలా అమ్ముతున్నారంటూ గొడవకు దిగారు. పెట్రోల్ బంక్ యజమాని దురుసుగా ప్రవర్తించడంతో వాహనదారులు స్థానికంగా ఉన్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కల్తీ పెట్రోల్ అమ్ముతున్న బడేమియా పెట్రోల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు పెట్రోల్ బంక్‌కు చేరుకుని పెట్రోల్‌ను పరిశీలించారు.

కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారని తెలిసి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. కాగా, త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర ఆలోచిస్తోంది. కాగా, దేశంలో కొద్దిరోజులుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన పెరిగిన ధరలు పెరిగాయి. ప్రస్తుతానికి ధరలో మార్పు లేకున్నా.. రికార్డు స్థాయిలోనే ధరలు కొనసాగుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.91.17, డీజిల్ రూ.88.60గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.25.. డీజిల్ ధర రూ.84.35గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.11.. డీజిల్ ధర రూ.86.45గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.79గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version