తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూపి లాగుతున్నారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.300 మంది విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అప్పటి ASP తిరుపతన్న వాంగ్మూలంలో చెప్పారు. ‘ట్యాపింగ్ సమాచారంతో కాంగ్రెస్, బీజేపీ నేతల నగదు సీజ్ చేశాం అని అన్నారు.
ఇదిలా ఉంటే… ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవ్వాళ విచారణ జరిగింది. అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగాయి.జూన్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.