పుడింగ్ పబ్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

-

హైదరాబాద్ న‌గ‌రంలోని బంజార‌హిల్స్ లోగ‌ల‌ పుడింగ్ ప‌బ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసు లో పుడిండ్ ప‌బ్ య‌జ‌మాని తో పాటు మేనేజ‌ర్ ను ఆ రోజు పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇప్పటి వ‌ర‌కు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగ ఈ రోజు వీరిని నాంపల్లి కోర్టులు ప్రవేశ పెట్టారు. నిందితుల‌ను పోలీసు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు.. నాంపల్లి కోర్టులో వాదించారు. ఇరు వ‌ర్గాల వాద‌నలు విన్న నాంప‌ల్లి కోర్టు.. నిందితుల‌ను పోలీసు క‌స్ట‌డికి అప్ప‌గించేందుకు అనుమతి ఇచ్చింది.

నిందితులను 4 రోజుల కస్టడీ ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల‌తో రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు నిందితులు అభిషేక్, అనిల్ పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. చంచ‌ల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా అభిషేఖ్, అనిల్ ను రేపు బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించ‌నున్నారు. కాగ‌ పుడింగ్ పబ్‌లో కొకైన్ లభించడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప‌బ్ లోకి కొకైన్ ఎలా వ‌చ్చింది. ఎక్క‌డ నుంచి వ‌స్తుంది అని ప్ర‌శ్నించే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version